Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి
నవతెలంగాణ-శాయంపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్కతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందని వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని గోవిందాపూర్, పత్తిపాక గ్రామాలలో బతుకమ్మ తల్లి విగ్రహాలను ఆయా గ్రామాల సర్పంచ్లు బైరి శ్రీనివాస్, చిట్టిరెడ్డి రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్పర్సన్ జ్యోతి పాల్గొని ఆవిష్కరించారు. అనంతరం పత్తిపాక గ్రామంలోని భక్తాంజనేయ ఆలయంలో విష్ణు సహస్ర పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోనే పూలను పూజించే సంస్కతి ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ బతుకమ్మ పర్వదినాన్ని పురస్క రించుకొని ఆడబిడ్డలకు కానుకగా 18 ఏళ్ల పైబడిన మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, ఎంపీటీసీలు వావిలాల వేణుగోపాల్, మాచర్ల మంగమ్మరవి, పరకాల ఏ ఎంసి మాజీ చైర్మన్ పోలపల్లి శ్రీనివాసరెడ్డి, నాయకులు ఒంటేరు వీరస్వామి, కిష్టయ్య, సుధాకర్ రావు పాల్గొన్నారు.