Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ ఘనపూర్
రైతులు తమ పశువుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే జాగ్రత్తలు వహించాలని వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ గుజ్జరి రాజు అన్నారు. చిల్పూర్ మండలం లోని పల్లగుట్ట గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం మార్కె టింగ్ శాఖ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని ఎంపీపీ బొమ్మిశెట్టి సరితా బాలరాజు, దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలానుగుణంగా పశువులకు వ్యాధి నిరోధక మందులు అందించాలని అన్నారు. అంతేకాకుండా రైతులు పశువుల విషయంలో పరిశుభ్రత జాగ్రత్తలు పాటిస్తూనే, వైద్యుల సూచనలు, సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొట్టు మానస, ఎంపీటీసీ జీడి ఝాన్సీ రాణి, ఉప సర్పంచ్ బత్తిని శ్రీనివాస్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, మార్కెట్ కార్యదర్శి జీవన్ కుమార్, మార్కెట్ వైస్ చల్లా చైర్మన్ చందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజన్ బాబు, శ్యాంసుందర్, రాజ్ కుమార్, హరీష్, వరుణ్, చిగురు సరిత, మండల పశు వైద్యాదికారి యం అనేష్, వైద్య సిబ్బంది ఫయాస్,రమేష్, సదానందం, గోపాలమిత్ర అయాస్ రైతులు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.