Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు వ్యవసాయం చేస్తున్న
- గిరిజనులకు న్యాయం చేస్తాం
- ఎఫ్ఆర్వో కమల
నవతెలంగాణ-మహదేవపూర్
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం సర్పంచ్ శ్రీపతిబాపు అధ్యక్షతన పోడు భూముల గ్రామ సభ నిర్వహించారు. సాగులో ఉన్న పోడు భూములను గుర్తించి, గ్రామ స్థాయి పోడు భూముల కో ఆర్డిన ేషన్ కమిటీ సమన్వయంతో పోడు వ్యవసాయమే జీవనా ధారమైన ఆదివాసీ, గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎఫ్ఆర్వో కమల అన్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న వారికే ప్రభుత్వం న్యా యం ఉంటుందని, 51 సర్వే నెంబర్లో గతంలో పట్టా ఇచ్చిన వారికి గ్రామ కో ఆర్డినేటర్ కమిటీ సమన్వయంతో న్యాయం జరిగేలా చూస్తామని సర్పంచ్ అన్నారు. ఎస్ సి,ఎస్టీలకు అసైన్ మెంట్ కమిటీ ద్వారానే 473 సర్వే నెంబర్ల లో గతంలో పట్టాలు ఇచ్చారంటే భూమి ఉన్నట్లే కదా? ఫారెస్ట్ వారు దౌర్జన్యంగా భూమిలో పోడు సాగును అడ్డుకుంటే రెవిన్యూ వారు ఎవరిపై పోరాడాల్సి ఉండేదో ఆలోచించాలని పొడు భూములకో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు లింగాల రామయ్య అన్నారు. 463,473,600 బంజారాయి లో పోడు భూముల సమస్యలు జాయింట్ సర్వే చేసైనా పరిష్కరించాలన్నారు. 12 సంవత్సరా లుగా కాస్తులో ఉంటే ఆ భూమి సాగు చేస్తున్న వారికే దక్కుతుం దని చట్టాలు చెపుతున్నాయని గ్రామ పోడు భూముల కమిటీ కో ఆర్డినేషన్ అధ్యక్షులు మెరుగు లక్ష్మణ్ అన్నారు.పట్టాలు ఇవ్వడమే కాదు..భూమి చూపకపోతే మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అధికారులు గ్రహించాలని అన్నారు.అధికారం లేకపోతే రెవిన్యూ వారు పట్టాలు ఎలా ఇస్తారని,గ్రామాభివద్ధి కోసం ఎస్ట్రెంక్షన్ బ్లాక్ ఏర్పాటు చేయాలని మాజీ సింగిల్ విండో ఛైర్మెన్ వామన్ రావు అన్నారు. ఇరుషాద్ ఖాన్కు 51 సర్వే నెంబర్లో, కన్నె సమ్మయ్యకు రెండు ఎకరాలు భూమి అప్పటి కలెక్టర్ ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు సాగుచేసిన ఫారెస్ట్ వారు దౌర్జన్యంగా కంచె వేశారని,వారికి న్యాయం జరిగేలా చూ డాలని అధికారులను కోరారు. గ్రామంలో మిగిలిఉన్న రెవిన్యూ భూమి విస్తీర్ణం కంటే ఎక్కువ పట్టాలు ఉన్నాయని,సర్వే చేసి అస లు పట్టాలు గుర్తిస్తామని తహశీల్ధార్ శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్ ఓ ప్రసాద్,గ్రామ కార్యదర్శి రజినీకాంత్ రెడ్డి, కమిటీ సభ్యులు కాలినేని రాములు,సమ్మయ్య,కారెంగుల బాపురావు, ఆదివాసీ గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.