Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ ఘనపూర్
తెలంగాణలోని గిరిజనులు ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్ కు గిరిజన, ఆదివాసీ ప్రజలు రుణపడి ఉంటారని తహశీ ల్దార్ పూల్ సింగ్ చౌహాన్ అన్నారు. రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్ 10శాతానికి పెంపు అమలుపై డివిజన్ కేంద్రం లో శనివారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రాపాలనలో రాష్ట్రం వెనుకబడిందని ఉద్దేశించి, సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్ష, సుదీర్ఘ పోరాట ఫలితమే స్వరాష్ట్రమని, ప్రజల ఆత్మగౌరవం, మన నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు, ఉపాధి, భాషా, సంస్కతి, సంప్రదాయాలతో మన రాజ్యాన్ని మనమే పాలిం చు కోవాలనే భాగంగా, రాష్ట్రం ఏర్పాటు అనంతరం గిరిజన తెగల బలోపేతానికి బంజారాభవన్, సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించి, తండాలను గ్రామా లుగా చేసి, ''మా తండాలు మా రాజ్యం'' అనే నినాదంతో గిరిజనులకు మేలు చేశారని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనుకరిస్తూ వెనుకబడిన జాతులను ప్రోత్స హించడంలో సీఎం కేసీఆర్ నిర్ణయాలు సాహ సోపే తమైనవని అన్నారు. ఆరు శాతానికి పరిమితమైన రిజర్వేషన్లో గిరిజనులకు, ఉద్యోగ, విద్యావకాశాల్లో నాలుగు శాతం కోల్పోతున్నారని గమనించి, సీఎం కేసీఆర్ గిరిజన పక్షపాతిగా నిలిచి 10 శాతం రిజర్వేషన్ అమలు చేయడం హర్షనీయమని అన్నారు. ఇందుకు సహకరించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇతర నాయ కులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో బానో త్ వెంకట్రాం, అర్జున్, రవీందర్, గణేష్, రాము, దయాకర్, రాజునాయక్, దేవోజి ,హారన్, తదితరులు పాల్గొన్నారు.