Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లల భవిష్యత్‌కు దిక్సూచి వృద్ధులు
- వృద్ధుల సహాయార్థం అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్
- జిల్లా సంక్షేమ అధికారి సామ్యూల్
- ఘనంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం
నవతెలంగాణ-భూపాలపల్లి
వృద్ధాప్యం వయసుకే కానీ మనసుకు కాదని జిల్లా సంక్షేమ అధికారి కే సామ్యూల్ అన్నారు. శనివారం అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి డిడబ్ల్యుఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు మనోధైర్యంతో ముందుకు సాగాలని పూర్తి ఆరోగ్యవంతులుగా జీవించాలని అన్నారు. వృద్ధుల ఎలాంటి సమస్యనైనా మహిళా శిశు సంక్షేమ శాఖ దష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తామని అన్నారు వృద్ధులకు పెన్షన్ కుటుంబ సభ్యులతో తగాదాలు, ఆరోగ్య సమస్యలు,ఆస్తి సమస్యలు, మానసిక సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని వద్ధులకు కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్ 14567 ద్వారా సమాచారం అందించాలన్నారు. వృద్ధాప్యం వచ్చిందని వారి ఆలనా పాలన చూడకుండా ఇబ్బం దులకు గురి చేయరాదని వారిని దైవ సమానంగా పూజించాలని అన్నారు వద్ధుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వృద్ధుల సంక్షేమం కోసం జిల్లా కలెక్టర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని త్వరలోనే వారికి తీపి కబురు అందిస్తారని అన్నారు. నిరాదరణ గురైన వృద్ధుల సంక్షేమం కోసం స్వచ్ఛంద సంస్థ నిర్వహించడం అభినందనీయమని అమృత వర్షిని అక్షర స్వచ్చంద సేవా సంస్థ నిర్వాహకులు కుసుమ శ్యాంప్రసాద్‌ను డిడబ్ల్యూఓ అభినందించారు. వృద్ధుల సంక్షేమం కోసం త్వరలోనే నిరాదరణకు గురైన వృద్ధులను షెల్టర్ హౌమ్ కు తర లించనున్నట్లు తెలిపారు .అనంతరం వయోవృద్ధులను శాలువా లతో సత్కరించి సన్మానించారు. కార్యక్రమంలో డిసిఆర్బి సిఐ పెద్ద న్న కుమార్, భూపాలపల్లి సిడిపిఓ అవంతి, మహాదేవపూర్ సిడిపిఓ రాధిక, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమాదేవి, భూపాలపల్లి, ఘనపూర్, మొగుళ్లపల్లి, టేకుమట్ల ఎంఈవోలు దేవా నాయక్, సురేందర్, ప్రభాకర్, రఘుపతిలు, జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కట్ట రామచందర్, అమత వర్షిని అక్షర స్వచ్చంద సేవా సంస్థ నిర్వాహకులు కుసుమశాంప్రసాద్, హెచ్ఏంఆర్డిఎస్ నిర్వాహకులు రజిత, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వయోవద్ధులు తదితరులు పాల్గొన్నారు.