Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
అటవీ భూముల ఆక్రమణకు పాల్పడితే అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హెచ్చరించారు. శనివారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ పోడు భూముల సమస్య పరిష్కారంలో భా గంగా గ్రామాలలో సర్వే చేపడుతున్న నేపథ్యంలో నూతనంగా అట వీ భూముల ఆక్రమణకు పాల్పడుతున్నట్లు సమాచారం అందు తుందన్నారు. దీనిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ఆక్రమణ దారులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించ వద్దని కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం 2005 సంవత్సరం కంటే ముం దు నుంచి అన్యాక్రాంతమైన పోడు భూములు సాగు చేస్తున్న గిరిజ ను లు, 3 తరాలుగా సాగు చేస్తున్న గిరిజనేతరులకు ఆరో.ఎఫ్.ఆర్ పట్టాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, నూతన భూ అక్రమ దారులను ఎట్టి పరిస్థితుల్లో సహించమని కలెక్టర్ స్పష్టం చేశారు.పోడు భూముల సమస్య పరిష్కారం అనంతరం ఇంచు భూమి సైతం ఆక్రమణకు గురికాకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని, జిల్లాలో నూతనంగా అడవుల ఆక్రమణ చేస్తున్న వారిపట్ల సంరక్షణ చట్టం ప్రకారం తీవ్ర కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు.