Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్దిదారులకు చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే చల్లా
నవతెలంగాణ-సంగెం
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం పేదలకు వరంగా మారిందని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మంది లబ్దిదారులకు 30,03,480 రూపాయల విలువ చేసే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను హనుమకొండలోని వారి నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు అందచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే గొప్ప పథకాలు అని అన్నారు. పేదరికంతో బాధపడుతూ ఆడపిల్లల పెండ్లి అంటే ఆందోళన పడే కుటుంబాల ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం వచ్చిన తర్వాత ఆడపిల్లల పెండ్లి అంటే బరువు అనే భావన మారిపోయిందన్నారు. దీంతో పాటు సీఎం కేసీఆర్ రూపొందించిన ఆసరా, కేసీఆర్ కిట్స్?? తదితర పథకాలన్నీ పేదలకు ఎంతో సహాయపడుతున్నాయన్నారు. దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల ఇళ్లలో ఆడపిల్లల పెండ్లిల కోసం అప్పు చేసినటువంటి తల్లిదండ్రులను ఆర్ధికంగా ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ ముందుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో, జడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పూలుగు సాగర్ రెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు కందకట్ల నరహరి, ఏఎంసి డైరెక్టర్ సారంగపాణి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సర్పంచులు కక్కెర్ల కుమారస్వామి, దొనికల రమ శ్రీనివాస్, బిచ్చ నాయక్, మంగ్యా నాయక్, ఎంపీటీసీ నరసింహస్వామి, మండల ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.