Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల మతాలకు అతీతంగా బతుకమ్మ వేడుకలు.
- వేడుకల్లో పాల్గొన్న మహిళ కార్యదర్శులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు
- యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
నవతెలంగాణ-సంగెం
మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆవరణలో మహిళ కార్యదర్శులు, సర్పంచులు, సీఏలు, ఎంపీటీసీలు, డ్వాక్రా సంఘాల అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మొదటిసారిగా ముస్లిం మహిళ ఉద్యోగి పాల్గొని అందరి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం సర్పంచ్ గుండేటి బాబు అధ్యక్షతన జరిగిన, బతుకమ్మ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి, ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ బాబు మాట్లా డుతూ కుల మతాలకు అతీతంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుం టున్నారు.అనడానికి నిదర్శనం మండల కేంద్రంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ముస్లిం మహిళ పాల్గొనడం నిదర్శనమని అన్నారు. ప్రతిపక్షాలు మతతత్వ పార్టీలు సుఖంగా సంతోషంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కుల మతాల పేరుతో విడదీయాలని చూసిన ముస్లిం మహిళ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని అలాంటి వ్యక్తులకు మతతత్వ పార్టీలకు రాష్ట్రంలో తావు లేదని నిరూపించారని మహిళా ఉద్యోగికి హదయపూర్వక అభినందనలు తెలిపారు. పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మతతత్వ పార్టీ అయినా బిజెపి విడదీయాలని చూసిన వారికి తావు లేదని మహిళలు చాటి చెప్పారని తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న వివిధ శాఖలకు సంబంధించిన మహిళలకు బతుకమ్మ పోటీల్లో నిలిచిన మొదటి, రెండవ, మూడవ స్థానాల్లో, నిలిచిన వారికి బహుమతులను యూనియన్ బ్యాంకు వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్లేశం, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు కందకట్ల నరహరి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, ఎంపీటీసీలు, మెట్టు పెళ్లి మల్లయ్య, నరసింహస్వామి, మాజీ ఎంపీ టీసీ పులి వీరస్వామి, కోడూరి సదయ్య, కార్యదర్శులు, సిఏలు, డ్వాక్రా గ్రూపు అధ్యక్ష కార్యదర్శులు, ఏపీవో లక్ష్మి, ఎపిఎం కిషన్, ఎఫ్ఎలా మంండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.