Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
గత 8సంవత్సరాల పాటు గిరిజనులు సాగించిన పోరా టాల ఫలితంగానే తెలంగాణలో గిరిజనులకు రిజర్వే షన్ 6 నుండి 10 శాతానికి పెంచుతూ జీవో 33 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఆంగోతు వెంకన్న అన్నారు శనివారం గిరిజ న సంఘం జిల్లా కమిటీ సమావేశం భూక్యా హరినాయక్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆంగోత్ వెంకన్నమాట్లాడుతూఇచ్చిన వాగ్దానం ప్రకారం జీవో జారీ చేయడంతో పాటు తక్షణం ఈరోజు నుండే అమలు చేస్తున్నట్లు ప్రకటించ డాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. గిరిజన సంఘం అధ్వర్యంలో మొదటి సారిగా 2014 డిసెంబర్ లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద వేలాదిమందితో మహాధర్నా నిర్వహించి గిరిజన రిజర్వేషన్ సాధన ఉద్యమానికి నాంది పలికింది అన్నారు గత 8 సంవత్సరాలుగా రాజీలేని పోరాటాలు నిర్వహించింది. ఉద్యమకారులపై పెట్టిన కేసులు అన్నిటిని ఎత్తివే యాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గిరిజన సంఘాలతో అనేక దఫాలుగా రౌండ్ టేబుల్ సమావేశాలు,ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించా మన్నారు. వారం రోజుల్లో గిరిజన రిజ్వేషన్ జీవో జారీ చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ప్రకారం తక్షణం జీవో జారీ చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 29 న రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు మెమొరాండాలు ఇచ్చి వినూత్నంగా నిరసన తెలియజేసి ప్రభుత్వంపై మరింత వత్తిడి పెంచింది గిరిజన సంఘమే అన్నారు. పలితంగా గిరిజన రిజర్వేషన్ ను పెంచుతూ జీవో జారీ అయ్యిందని తెలిపారు. గిరిజన రిజర్వేషన్ సాధన ఉద్య మంలో సుదీర్ఘకాలం పాల్గొన్న యావత్ గిరిజన సమాజానికి జేజేలు తెలి తేస్తున్నాము అన్నారు. సాధించిన ఉద్యమ విజయంతో సంతృప్తి చెందకుండా న్యాయస్థానాల్లో ఆటం కాలు లేకుండా జీవో అమలు జరిగే విధంగా కేంద్రం చట్టబద్ధత కల్పించేందుకు బాధ్యత తీసుకోవాలి.అందుకు రాజ్యాంగం లోని ఆర్టికల్ 9 లో చేర్చే విధంగా పార్లమెంట్ లో చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాము అన్నారు. సాధించిన పోరాట స్ఫూర్తితో గిరిజన హక్కుల కోసం మరిన్ని ఉద్యమాలకు సిద్ధపడదామని, అందుకు కలిసి వచ్చే గిరిజన సంఘాలతో త్వరలోనే ఉద్యమ కార్యాచరణ కోసం మా వంతు కషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు సీతారాం నాయక్, బానోత్ వెంకన్న, ఎం కిషన్ పాల్గొన్నారు.