Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
దేశ వ్యాపితంగా భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల రక్తంతో కూడిన చెమట చుక్కల ఫలితంగా పొగవుతున్న కోట్లాది రూపాయల సెస్ ను,నిర్మాణ రంగ కార్మికులకు ఖర్చు చేయ కుండా,వారి సంక్షేమం కోసం కాకుండా, ప్రక్క దారి పట్టిస్తూ ఇతర పథకాలకు ఉపయో గించడం నిర్మాణ రంగ కార్మికులను మోసం చేయడమే నని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్, జిల్లా ప్రధాన కార్యదర్శి హలవత్ లింగ్యాలు విమర్శించారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (ఐ ఎఫ్ టి యు)ప్రథమ మహాసభ జరిగింది. తొలుత పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు మహాసభను ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మండల వెంకన్న ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు,కార్మిక వ్యతిరేక విధానాలను వివరించారు. మహాసభకు పర్వ తం కోటేశ్, ఎం డీ జబ్బార్, రాసమల్ల ఉప్పల య్యలు అధ్యక్ష వర్గగంగా వ్యవహరించారు. అనంతరం జరిగిన సభలో ఈ సందర్భంగా, జనార్ధన్, లింగ్యాలు మాట్లాడుతూ 1996 లో ఐఎఫ్టియు, కార్మిక సంఘాలు పోరాడిన ఫలితంగా బీ ఓ సీ (బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్) చట్టం వచ్చిందని,దాని అమలు కోసం కేంద్రం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కషి చేయకుండా, దుర్వినియోగం చేయడమే కాకుండా, ఇతర ఆర్ హుత్వ పథకాలకు మళ్ళించడం వలన కార్మికు లు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో జోక్యం చేసుకుని 1998 లో బీ ఓ సీ(సెంట్రల్ రూల్స్) చట్టం వచ్చిందని అన్నారు. నిర్మాణ కార్మికులు మాత్రం ప్రమా దంలో, సహ జ మరణం లో చనిపోయినపుడు అతి తక్కువ గా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టి. లక్ష్మయ్య, కష్ణ, చంద్రమౌళి,కొనుపాక ఐలయ్య, యాకయ్య, సైదులు, వెంకన్న, రమేష్,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.