Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క ఆదివారం గూడూరు వచ్చిన సందర్భంగా ఆదివాసి ఉద్యోగుల సంఘం బాధ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. మండల సమస్యలు వివరించారు. మట్టేవాడ గ్రామపంచాయతీ మారుమూల గ్రామమైన దొరవారి తిమ్మాపురానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సీతక్క స్పందించి తక్షణమే రోడ్డు సౌకర్యం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతరం వారిని శాలువతో సత్కరించారు. ఉపాధ్యాయులు పెనుక ప్రభాకర్, ఆదివాసీ ఉద్యోగుల సంఘం బాధ్యులు అయిలబోయిన వీరయ్య, ముయ్యబోయిన వెంకన్న, పూనెం సమ్మయ్య, బత్తుల శ్రీనివాస్ ఊకె లక్ష్మయ్య, కొట్టం శ్రీను, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.