Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ, సర్పంచ్
నవతెలంగాణ-తరిగొప్పుల
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదలకు పెద్ద ఎత్తున ఆసరా పెన్షన్లు అందుతున్నాయని, ఇది సీఎం కేసీఆర్ తీసుకున్న గొప్ప సాహసం అని ఎంపీపీ జొన్నగొని హరిత సుదర్శన్ గౌడ్, సర్పంచ్ అమీర్ శెట్టి వీరేందర్ అన్నారు. మండలం పరిధి అక్కరాజుపల్లి గ్రామంలో ఆదివారం మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లబ్దిదారులకు నూతన పెన్షన్ కార్డుల తో పాటు పెన్షన్ నగదును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పింఛన్ రానివారు అధైర్యపడవద్దని, అర్హులందరికి ఆసరా పెన్షన్లు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అమరేందర్ రెడ్డి, వార్డు సభ్యులు రాజు, రమేష్, యాదగిరి,గౌడ సంఘం నాయకులు సుధ కర్, వెంకట మల్లయ్య, శ్రీనివాస్ తదితరుల పాల్గొన్నారు.