Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి సాంబయ్య
నవతెలంగాణ-హసన్‌పర్తి
కుల వివక్ష లేని సమాజ నిర్మాణమే కేవీపీఎస్ లక్ష్యమని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి సాంబయ్య అన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం హసన్‌పర్తిలో ఘనంగా జరి గాయి. స్థానిక బస్టాండ్ సెంటర్లో మండల కార్యదర్శి గోల్కొండ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం అశోక్‌తో కలిసి ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలనే లక్ష్యాలుగా 1998 అక్టోబర్ 02న గాంధీ జయంతి రోజు ఏర్పడిన కెేవీపీఎస్ 24 సంవత్సరాల ప్రస్థానంలో కుల వివక్షకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించిం దన్నారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, జస్టిస్ పున్నయ్య కమి షన్ లాంటి అనేకం సాధించాయన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించడంతో పాటు ఆర్థిక సహాయం కోసం సమాజంలో ఎదురవుతున్న అన్ని వివక్షలకు హత్యలు, అత్యాచారాలను, అంటరానితనాన్ని నిర్మూలించాలని అనేక పోరాటాలు చేసి విజయం సాధించిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేవీపీఎస్ నాయకులు మొగిలి, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.