Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
స్వాతంత్య్రం కోసం దేశ ప్రజలందరినీ ఏకతాటిపై నడిపిన మహౌన్నత వ్యక్తి గాంధీ అని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య కొనియాడారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి పురస్కరించుకుని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమద్ తో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉన్న సామ్రాజ్యాన్ని శాంతి మార్గాలను అనుసరిస్తూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహౌన్నతమైన వ్యక్తి గాంధృ అన్నారు. బాపూజీ ఆశయసాధనలో ప్రతి ఒక్కరు నడవాలని, అహింసా మార్గాన్ని అవలంబించాల న్నారు. మున్సిపల్ చైర్మన్ పొకల జమున, డి డబ్ల్యు ఓ జయంతి, సివిల్ సప్లై అధికారి రోజా రాణి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో
గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన చిత్రప టానికి పూల మాలలు వేసి కార్యకర్తలు నాయకులు నివాళులర్పించారు. పార్టీ పాఠశాల అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికె ఇందిర, మీడియా ఇంచార్జ్ పిట్టల సతీష్, బడికే కష్ణ స్వామి, వేణుమాధవ్, ఉడుత రవి, వంగాల కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.