Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
హనుమకొండ రాంనగర్ లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఆదివారం ఎస్ఎల్టిఏ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ బన్న ఐలయ్య, కేయూ తెలుగు శాకాధిపతి పంతంగి వెంకటేశ్వర్లు కవి రచయిత దోరవేటి చెన్నయ్యతో కలిసి ఎస్ఎల్టీఏ రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్ పాల్గొని పథకావిష్కరణ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్ఎల్టిఏ సీనియర్ సభ్యులను సన్మానించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, ముఖ్య సలహాదారు బ్రహ్మయ్య మాట్లాడుతూ .. ఆత్మ గౌరవం, భాష సేవే లక్ష్యం నినాదంతో ఎస్ఎల్టిఏ ఆవిర్భవించిందన్నారు. ఈ వేడుకలను ఏడాది పాటు అన్ని జిల్లాలను వేదికగా చేసుకొని నిర్వ హిస్తామన్నారు. అనంతరం చక్రవర్తుల రాధా కృష్ణ సాహితీ వేదికను ప్రారంభించినట్టు తెలి పారు. చక్రవర్తుల శ్రీనివాస్ ను చక్రవర్తుల మధును అభినందించారు. డాక్టర్ మడత భాస్కర్, అన్నయ్య దోరవేటి చెన్నయ్య, సోమ రామచంద్రం రచించిన కవితా సంపుటిలను ఆవిష్కరించారు. అనంతరం బన్న ఐలయ్య మాట్లాడుతూ.. మన తెలుగు భాషను ప్రాచిన సాహిత్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు చంద్రమోహన్ వివిధ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.