Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
అవయవాదం అత్యున్నతమైన దానమని తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేత్ర దానం తో అంధుల్లో వెలుగులు, అవయవదానంతో, ఆరిపోయే ప్రాణాలకు ఆయుష్షును, దేహ దానంతో భావి వైద్యుల పరిశోధనలకు ఉప యోగ పడవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని, తెలం గాణ నేత్ర శరీర అవయవదాతలు సహకరిం చాలన్నారు. అనంతరం డాక్టర్ అశోక్ పాల్గొని మాట్లాడారు. అవయవ దానం చేసి చిరంజీవు లుగా మిగిలి పోవాలని తెలిపారు. దేశంలో పన్నెండు లక్షల మంది అంధులు ఇంతవరకు ప్రపంచాన్ని చూడలేక, నేత్ర దాతల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. అనం తరం సంబంధిత కరపత్రాలు ఆవిష్క రించారు. నేత్ర,అవయవ దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సర్పంచ్ కుర్ర సాంబమూర్తి గౌడ్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో అవయవ నేత్రదానంపై అవగాహన కల్పిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ముల్క ఐలయ్య, వైస్ ఎంపీపీ తంగెడ నగేష్ ఉప సర్పంచ్ సంకీర్తన ప్రహల్లద్, టీఆర్ఎస్వీ మండల ఉపాధ్యక్షులు ఎంజాల కృష్ణసాయి, మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి సంపత్రావు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు గుండేటి సతీష్, సింగన బోయిన ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.