Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
గ్రేటర్ 1వ డివిజన్ పరిధి హసన్‌పర్తి పద్మశాలి కాలనీ స్మశాన వాటికలో ఆదివారం బోర్ వెల్ పనులను వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలు స్మశాన వాటిక నిర్మాణలను విస్మరిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామగ్రామాన స్మశాల వాటికలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సారంగపాణి, హరికుమార్, నవీన్, స్థానిక కార్పొరేటర్ అరుణాదేవి, జడ్పీటీసీ రేణికుంట్ల సునితప్రసాద్, మాజీ కార్పొరేటర్ దేవరకొండ అనిల్‌కుమార్‌యాదవ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బండి రజనీకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వీసం సురెందర్‌రెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు, విక్టర్‌బాబు, దేవస్థానం చైర్మెన్ చింతల లక్ష్మణ్‌యాదవ్, పద్మశాలి సేవా సంఘం నాయకులు భిక్షపతి, లక్ష్మణ్, తిరుపతి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.