Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి రాజయ్య
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
శాంతి, అహింసా మార్గాల్లో జాతిపిత మహాత్మాగాంధీ నాయకత్వంలో సాగిన భారత స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం కేసీఆర్ ఉద్యమించారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం గాంధీ 153వ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న 36 రాజకీయ పార్టీలను ఒప్పించి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా పునర్ నిర్మించడంలో భాగంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.
గిరిజన భాందవుడు సీఎం కేసీఆర్
తెలంగాణలోని గిరిజనులు ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్ కు గిరిజన, ఆదివాసీలు రుణపడి ఉండాలని, గిరిజన బాంధ వుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే అభివర్ణించారు. మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, దిశా కమిటీ సభ్యులు మాలోత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్ 10శాతానికి పెంపు అమలు గిరిజన ఆదివాసీ బంజారా ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. ఆంధ్రాపాలనలో రాష్ట్రం వెనుకబడిందని ఉద్దేశించి, సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్షతో, సుదీర్ఘ పోరాట ఫలితమే స్వరాష్ట్రమని అన్నారు. ప్రజల ఆత్మగౌరవం, మన నీళ్లు నిధులు, నియామకాలతో పాటు, ఉపాధి, భాషాసంస్కతి, సంప్రదాయాలతో మన రాజ్యాన్ని మనమే పాలించు కోవా లనే భాగంగా రాష్ట్రం ఏర్పాటు అనంతరం నిరంతర కృషఙ చేస్తున్నారన్నారు. గిరిజన తెగల బలోపేతానికి బంజా రాభవన్, సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించి, తండాలను గ్రామాలుగా చేసి గిరిజనులకు మేలు చేశారని కొనియాడారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనుసరిస్తూ వెనుకబడిన జాతులను ప్రోత్సహించడంలో సీఎం కేసీఆర్ నిర్ణయాలు సాహసోపేతమైనవని అన్నారు. ఆరు శాతానికి పరిమితమవగా, సీఎం కేసీఆర్ గిరిజన పక్షపాతిగా నిలిచి 10 శాతం రిజర్వేషన్ అమలు చేయడం హర్షనీయమన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపిపి కందుల రేఖ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తాటికొండ సురేష్ కుమార్, ఎంపిటిసిలు దయాకర్, నర్సింహులు, రాజు, మండల, పట్టణ అధ్యక్షులు మాచర్ల గణేష్, వారాల రమేష్ యాదవ్, మునిగెల రాజు, సీనియర్ నాయకులు బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.