Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక హంగులతో సరికొత్తగా ఉత్సవాలు
- జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుండి లక్షలాదిగా రాక
- మైసూర్ తర్వాత 2వ రంగలీల మైదానం
- అంబరాన్నంటేలా సంబరాల ఏర్పాట్లు
నవతెలంగాణ-మట్టెవాడ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పండు గల్లో సద్దుల బతుకమ్మ తర్వాత దసరా పండుగ ముఖ్యమైనది. ఆడబిడ్డలు బతుకమ్మ అనంతరం దసరాను చిన్న పల్లెలు మొద లుకొని పట్టణం వరకు ఈ పర్వదినాన జమ్మి ఆకు (బంగారం) ఆత్మీయులకు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుకుంటూ రావణాసుర ప్రతిమను దహనం చేయడమనేది తెలంగాణ సంస్కతిలో అంత ర్భాగంగా వస్తుంది. అలాంటి రావణవధ ఉర్సుగుట్ట వద్ద రంగలీల మైదానంలో నబూతో నా భవిష్యత్ అనే విధంగా ప్రతి సంవత్సరం సరికొత్త హంగులతో ప్రత్యేకతను చాటుకుం టున్నాయి. భారత దేశంలోనే మైసూర్ తర్వాత రెండవ స్థానాన్ని దక్కించుకుంది. వీక్షకులకు నచ్చేలా ఉర్సు రంగలీల మైదానంలో జరిగే సద్దుల బతుకమ్మ, దసరా రోజు నిర్వహించే రావణవధ కార్యక్రమంపై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం..
రావణవధ వందేళ్ల చరిత్ర..ఉర్సు గుట్ట
నిజాం పాలనలో రజాకార్ల ఆగడాలతో బంధించబడ్డ ఇక్కడి ప్రజలు పాలకులపై ఎదురు తిరిగి తమ వారి ధన, మాన, ప్రాణాలను కాపాడుకున్నారు. అధర్మం చేస్తూ ప్రజలను పీడించే రావణాసురుడు రాముని చేతిలో హతమయ్యాడు. ఆ చరిత్రను తీసుకొని చెడు పై మంచి విజయం సాధించిందని రజాకార్లను తరిమికొట్టిన విజయానికి స్ఫూర్తిగా దసరా రోజు నాటి ప్రజలు వేడుకలు చేసుకునేవారు. ఉర్సుగుట్ట పై కొలువై ఉన్న రంగనా యకుల స్వామికి పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించే ఆనవా యితీ నేటికీ ఉంది. రంగసముద్రం చెరువు, రంగలీల మైదా నంలో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన రావణవధ కార్యక్రమం మొదట్లో గుర్రంపైన గొర్రెను పెట్టి పెనుగులాటలతో గ్రూపులుగా ప్రజ లు ఉండి గొర్రెను ఒకరికి ఒకరు లాక్కొని ఉత్సవాలను జరుపుకునే వారు. దీంతో ప్రజల్లో ఉద్రిక్త వాతా వరణం, గొడవలు అవ్వడం గమ నించిన మార్గం శంకర్, నాగపురి సారంగపాణి నాగేశ్వరరావు ఆసం సత్యనారాయణల ఉత్సవాలు శాంతి యుతంగా జరగాలనే ఆకాంక్షతో రావణాసుర ప్రతిమకు నిప్పం టించే కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. అలా నాటినుండి నేటికి అభివృద్ధి చెందుతూ వందల సం వత్సరాల పాటు నిర్విరామంగా కొనసాగుతు నేడు దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది..
ఆకట్టుకునే విధంగా రావణ ప్రతిమ..
సుమారుగా 53 అడుగుల ఎత్తు రాజసం ఉట్టిపడేలా పది తలలతో, గధ ఆయుధం చేత పట్టుకొని భయపట్టేలా రావణా సుర ప్రతిమ చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది. ప్రత్యేక కళాకా రులచే నెల రోజుల ముందు నుండి ప్రతిమను తీర్చిదిద్దుతారు. ప్రతిమలో రకరకాల బాణాసంచాలు అమర్చి దసరా నాటికి సిద్ధమై ప్రతిమను రంగలీల మైదానానికి తరలిస్తారు. దసరా రాత్రి రంగలీల మైదానంలో వివిధ సాంస్కతిక కార్యక్రమాలు కళాకారుల చేత నత్యాలు, కోలాటాలు, పాటలు, పేరని నత్యాలు, మనోరంజకంగా నిర్వహిస్తారు. ఉర్సు గుట్ట ప్రాంతం విద్యుత్ అలంకరణలతో లేజర్ షోలతో మెరిసిపోయేలా మైదానాన్ని రావ ణాసుర ప్రతిమను తీర్చిదిద్దుతారు. రెండు గంటల పాటు ఆకా శంలో తారాజువ్వల వెలుగులు మిరిమిట్లు గొలిపేలా బాణా సంచాలను పేల్చుతారు. అనంతరం వివీఐపీల చేత రావణ ప్రతిమను దహనం చేస్తారు.
ఏమరుపాటు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు :
అధ్యక్ష కార్యదర్శులు నాగపురి సంజీవ్ బాబు, మేడిది మధుసూదన్
పూర్వీకులు చూపెట్టిన సాంప్రదా యాలను భావితరాలకు అందించే విధం గా ఉర్సు గుట్ట సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రావణవధ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నాం. చెడుపై మంచి ఏనాటికైనా విజ యం సాధిస్తుంది అనేది నేటి తరానికి అర్థం అయ్యేలా ఆడదాన్ని చెర పట్టి నాశ నమైన రావణాసుర ప్రతిమకు దహన కార్యక్రమం చేస్తం. ఆడపడుచులు బతు కమ్మలు ఆడుకునే విధంగా కాకతీయ చెరువు రంగసముద్రంలో ప్రభుత్వ అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు కమిటీ ఆధ్వర్యంలో చేశాం. గజ ఈతగాళ్లను వలంటీర్లను అందు బాటులో ఉంచామన్నారు. దాతల సహకారంతో రూ.20 లక్షల తో దసరా రోజు నిర్వహించే రావణవధ కార్యక్రమానికి దసరా ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో నెలరోజుల నుండి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తు న్నాం. ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలు, అందరూ వీక్షించేలా విద్యుత్ తెరలను అందు బాటులో ఏర్పాటు చేశామన్నారు. సాంస్కతిక కార్యక్రమాలతో పాటు గత సంవ త్సరానికి వైవిధ్య భరితంగా రంగురంగుల బాణా సంచాలతో సందర్శకులను ఆకట్టుకునేలా ప్రోటోకాల్‌ను పాటిస్తూ, నాయ కులు, అధికారులు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం.