Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ వరంగల్ జిల్లా జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్
నవతెలంగాణ-వరంగల్
కుల నిర్మూలన సాధనే కేవిపిఎస్ లక్ష్యమని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ అన్నారు. వరంగల్ పోచం మైదాన్‌లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 24వ ఆవిర్భావ దినం సం దర్భంగా జిల్లా కమిటీ, గ్రేటర్ వరంగల్ నగరంలోని ఏరియా కమిటీల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణల కార్యక్రమం నిర్వహిం చారు. వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్లో జరిగిన కార్యక్రమానికి మంద యాకయ్య అధ్యక్షత వహించగా ఆరూరి కుమార్ పాల్గొని జెండా ఎగురవేశారు. కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు కార్యకర్తలు జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన అనే మహా త్మ జ్యోతిరావు పూలే, భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ ప్రధాన లక్ష్యంగా ఆవిర్భవించి 24 సంవత్సరాలు అవుతుందన్నారు. కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు, ఏరియాల నాయకులు రామన్నపేట లో సింగారపు సుమన్ పోచ మ్మ మైదాన్ దేశారు పేట కొత్తవాడ ప్రాంతంలో మంద యాకయ్య, రామంచ రాజు, కందికట్ల సంజీవ, మేకల లింగయ్య జెండాలు ఎగురవేశారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు వరుణ్ కుమార్, వీరస్వామి, కుమార్, ఐలయ్య, సురేష్, ఎల్లమ్మ, సదా నందం, రవి, చంటి, జానీ, కుమార్, కిరణ్, సారయ్య పాల్గొన్నారు.
కుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
పర్వతగిరి : ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలనకై పోరాడుదామని వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు దయాకర్ అన్నారు. కెవిపిఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కెవిపియస్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవీపీఎస్ 1998 అక్టోబర్ 2న ఆత్మగౌరవం సమా నత్వం కుల నిర్మూలన లక్ష్య సాధనకోసం ఏర్పడిందని అన్నారు. కెవిపిఎస్ ఏర్పడిన నాటి నుండి అనేక సమర సుశీల ఉద్యమాలు నిర్వహించి విజయాలు సాధించిందని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మాదాసియాకూబ్, సిఐటియు మండల కన్వీనర్ జిల్లా రమేష్, జిల్లా రాములు, చిన్న పెళ్లి కుమార్, డెక్కరవి, పోలోజు మహేష్,తదితరులు పాల్గొన్నారు.
మట్టెవాడ : ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన మన లక్ష్యం మని రంగశాయిపేట ఏరియా కమిటీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యులు ఉసిల్ల కుమార్ అన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 24వ ఆవిరా ్భవ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం నాయుడు పంపు జంక్షన్ వద్ద కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు ఇమ్మడి శ్రీనివాస్ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఎగరవేసి మాట్లాడిన ఆయన 1998 అక్టోబర్ 2న ఆవిర్భవించిన కెవిపిఎస్ ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన లక్ష్యంగా స్వీకరించింది అందుకోసం కెవిపిఎస్ ఆరోజు నుండి ఇప్పటివరకు పోరాడుతుందని అన్నారు. కార్యక్రమంలో కళ్యాణ్ కుమార్, వినోద్ కుమార్, ప్రమోద్, పవన్, బిక్షపతి, విజయ్, హేమలత, మేకల లక్ష్మి, దివ్య, ఐలమ్మ, కొమ్ము యాకూబ్, కొమ్ము అభి, ఎస్ ఆనందం, అనిత తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల ఆశయసాధనకు పాటుపడాలి
భూపాలపల్లి : మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇసునం మహేందర్, గుర్రం దేవేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన జెండాను జిల్లా అధ్యక్షులు మహేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుల ఆశయాల సాధనకై 1998 అక్టోబర్ 2న కులవివక్ష వ్యతిరేక పొరాట సంఘం ఏర్ప డిందన్నారు. కెవిపిఎస్ ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన అనే లక్ష్యాలు సాధన కోసం ఒక చారిత్రక అవసరంగా ఏర్పడి 23 ఏళ్ల కాలంలో ఎస్సీ ఎస్టీ కమిషన్. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం. స్మశా న స్థలాల కోసం 12 35 జీవో. దళితులకు 101 యూనిట్ల వరకు ఉచిత కరెంటుకోసం జీవో 342.ను కులాంతర వివా హే తుల ప్రో త్సాహం కోసం రెండు లక్షల 50 వేలు పెంపు జీవో నెంబర్ 12. ను వాటితో పాటు సంక్షేమ హాస్టల్ విద్యార్థుల నెల సరి ప్రాథమిక సమస్యల పరిష్కారం కోసం ఐదు వేల రూపాయలు వచ్చే విధంగా పోరాడి సాధించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రమేష్, వినరు, శ్రీధర్, జగన్, సమ్మయ్య, సుమన్, సురేష్, పాల్గొన్నారు.