Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ గుండు సుధారాణి
- ఘనంగా పోపా ప్రతిభా పురస్కార్‌ల ప్రదానం
నవతెలంగాణ-ఖిలావరంగల్
పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఆదివారం శివనగర్‌లోని పద్మశాలీ కల్యాణ మండపంలో నిర్వహిం చిన పోపా ప్రతిభా పురస్కార్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు బాగా చదివి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరో హించాలని సూచించారు. అనంతరం పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ మాట్లాడు తూ.. పద్మశాలీలు చాలా మంది సివిల్స్, గ్రూప్స్‌లలో ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానంలో ఉన్నారని, వారు ప్రతిభ గల పేద విద్యార్థులకు సాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమరంలో పోపా, పద్మశాలీ విద్యావిభాగంల సం యుక్త ఆధ్వర్యంలో ప్రతిభ కనబర్చిన పద్మశాలీ విద్యా ర్థులకు ప్రతిభా పురస్కార్, మెమోంటో, నగదుతో సత్క రించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 40మంది టెన్త్, 40మంది యింటర్, నీట్లో ప్రతిభ కనబర్చిన 15 మందికి, అడ్వాన్స్ జేయీయీలో 10మందికి, యింజ నీరింగ్, ఎంసెట్‌లకు సంబంధించి 15మందికి అవా ర్డులు ప్రదానం చేసినట్టు చెప్పారు. అదే విధంగా 14 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోపా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు కామేశ్వర్, పాము శ్రీనివాస్, విద్యా విభాగం అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ వంగరి సూర్యనారాయణ, నందాల చందర్ బాబు, ముఖ్యఅతిథి గుండు ప్రభాకర్, ప్రొఫెసర్ దామోదర్, వెంకట నారా యణ, రుద్ర సాయిబాబాలు, పోపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవాత్సవకు పద్మశాలి
ప్రతిభా పురస్కార్ అవార్డు..
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెం దిన పెనుగొండ శ్రీవాత్సవ ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు. ఆదివారం శివనగర్‌లోని పద్మశాలి కళ్యాణ మండపంలో మేయర్ గుండు సుధారాణి పద్మశాలి ప్రతిభా పురస్కార్ అవార్డుతో పాటు నగదు బహుమతి, మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి శ్రీవాత్సవతో పాటు ఆయన తల్లిదండ్రులు పెనుగొండ సోమన్న, నాగరాణిలను మేయర్ ఘనంగా సన్మానిం చారు. కార్యక్రమంలో పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్, పద్మశాలి విద్యా విభా గం రాష్ట్ర అధ్యక్షుడు వంగరి సూర్య నారాయణ, జిల్లా అధ్యక్షుడు గుండు కామే శ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పాము శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.