Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ
నవతెలంగాణ-మల్హర్రావు
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్‌లోని మూడు డీఏలను విడుదల చేసి వెంటనే మంజూరు చేయాలని, 317 జీవో ద్వారా ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, బతుకమ్మ, దసరా పండుగ సం దర్భంగా పెన్షన్‌దారులకు, ఉద్యోగులందరికీ వేతనాలు మం జూరు చేయాలని ఆదివారం జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమంలో సాధన కోసం ముందుండి పోరాడి, సకల జనుల సమ్మెను సైతం 42 రోజుల పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు రాష్ట్ర ఉద్యోగానికి సైతం వెళ్లకుండా రోడ్లపై సమ్మె చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకు వెళ్ళిన ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణ అన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులకు 1వతేదీన జీతం పడక పోవడంతో ఉద్యోగులకు సంబందించిన లోన్స్, ఈఎంఐలు, హౌస్ రెంట్స్, ఇతర ఖర్చులు కట్టలేక ఇబ్బంది, సివిల్ రేటు పడిపోవడంవల్ల ఉద్యోగ ఉపాధ్యాయులకు బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని చెప్పారు. కాంగ్రెస్స్ పార్టీ ప్రభుత్వంలో ఉద్యో గులకు, పెన్షన్ దారులకు వేతనాలను పండుగ సందర్భంగా ముందే ఇచ్చేదని గుర్తుచేశారు. ఈ నెలలో 4, 5 తేదీల్లో పండగుల సందర్భంగానైన రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ, విశ్రాంత ఉద్యోగులకు జీతాలు మంజూరు చేయాలని కోరారు.