Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి చంద్రమౌళి
నవతెలంగాణ-భూపాలపల్లి
ఎమ్మెస్పీ అధినేత మందకృష్ణ మాదిగ వారి తాతల ముత్తాతల నుండి ఉన్నటువంటి వారసత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మహాజన సోష లిస్టు పార్టీ జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరూరి రమేష్ తో పాటు అతని బినామీ గున్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేష్ బావమరిది సురేష్, శాయంపేటలోని మందకష్ణ మాదిగ తాత ముత్తాతల వారసత్వపు ఆస్తిని సర్వేనెంబర్ 121సీ లో 14 గుంటలు 121/బి లో 10 గుంటలు మొత్తం 24 గంటల భూమిని అధికారుల సహాయంతో ధరణి పోర్టల్‌లో మార్పి డి చేసుకోవడం జరిగిందన్నారు. గున్రెడ్డి మహేశ్వర్‌రెడ్డిని డిసిసిబి డైరెక్టర్ పదవి నుండి తొలగిస్తూ తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై సీఎం కేసీఆర్ స్పందిం చాల న్నారు. లేనియెడల రాబోవు రోజుల్లో రాష్ట్రంలోనే కాకుండా యా వత్తు భారతదేశంలోనే నిరసనలు ధర్నాలు రాస్తారోకాలు జరిగేటువంటి పరిణామాలు ముమ్మరంగా కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కన్వీనర్ గట్ల రాజన్న, జిల్లా కోఆర్డినేటర్ బొల్లి బాబు, జిల్లా కో కన్వీనర్ నోముల శ్రీనివాస్, జిల్లా కో ఇన్చార్జ్ కొమురయ్య, నియోజకవర్గ ఇన్చార్జ్ గాజుల బిక్షపతి, మండల కోఆర్డినేటర్ సురేష్ ,పట్టణ కోఆర్డినేటర్ దోర్నాల రాజేందర్, నాయకులు మంద తిరుపతి, సిరిపంగ చంటి, ఓనపాకల కుమార్, అశోక్, శ్రీకాంత్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.