Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గ ఇన్చార్జి డ్యాగల శ్రీనివాస్
- బీఎస్పీలో పలువురు చేరికలు
నవతెలంగాణ-నర్సంపేట
రాజ్యాధికారం సాధనకై బీఎస్‌లో చేరి ఆదరించాలని బీఎస్పీ అసెంబ్లీ నియోజవర్గ అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ కోరారు. ఆదివారం మండలంలోని చంద్రయ్యపల్లి, నాగుర్లపల్లి, భానో జిపేట, ఇటుకాలపెల్లి, ఇప్పల్‌తండా, ముత్తోజిపేట గ్రామాలకు చెం దిన పలవురు బీఎస్పీలో చేరారు. వారికి పార్టీ కండువ కప్పి శ్రీని వాస్ ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. జనాభాలో 80శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు రాజ్యాధికారం దక్కకుండా పోయిం దన్నారు. యేండ్ల తరబడి అగ్రకులాల చేతిలోనే రాజ్యాధికారం ఉండి పోయిందని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో నేటికీ పేద రికంలో మగ్గుతున్న కోట్లాది మంది కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయన్నారు. రాజ్యాధికారం చేతిలో ఉంటే సామాన్యుడి బ్రతు కులు తామే మార్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ దిశలో రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో ఇప్పటికే బీఎస్పీలో అనేక మంది చేరుతున్నారని తెలి పారు. నియోజవర్గంలోనూ బీఎస్పీ పట్ల ఆదరణ పెరుగు తుందనడానికి పెద్ద సంఖ్యలో చేరికలే నిదర్శనమన్నారు. ఈ కార్య క్రమంలో బీఎస్పీ మండల కన్వీనర్ బస్కె అశోక్, చంద్రయ్యపల్లి గ్రామ కన్వీనర్ కుక్కమూడి ప్రభాకర్, నాగూర్లపల్లె గ్రామ కన్వీనర్ తనుగుల శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో కుక్కమూడి నర్సయ్య, జినుకల యాకయ్య ముదిరాజ్, బరిగెల మీసాల కొమురయ్య, గొర్రె రామ స్వామి, కొండపాక లింగయ్య, కుక్కమూడి సౌందర్య, బరిగెల కరు ణ, బరిగెల ఇందిరలను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా కన్వీనర్ తనుగుల సుమలత, గ్రామ కన్వీనర్ కుక్కమూడి ప్రభాకర్, భద్రునాయక్, జన్ను శ్రీకాంత్, కత్తి రాజు, కో కన్వీనర్లు దరుగుల ఎల్లస్వామి, కుక్కమూడి ముత్తయ్య, బరిగెల రాజు, మహిళా కన్వీనర్ కుక్కమూడి లావణ్య (మేరి), కోకన్వీనర్ దరుగుల సరిత తదితరులు పాల్గొన్నారు.