Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ఉరుసు గుట్ట రంగ లీల మైదానంలో ప్రతి సం వత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించే రావణాసురవధ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉర్సు గుట్ట రంగ లీల మైదాన సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నాగపురి సంజీవ్ బాబు, మేడిది మధుసూదన్ లు పేర్కొన్నారు. సోమవారం నిర్వహించే స ద్దుల బతుకమ్మ 5న దసరా రోజున జరిగే రావణాసురవధ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆదర్శ పరపతి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆదివారం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉర్సు రంగలీల మైదానంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన రావణాసుర వధ కార్యక్రమాన్ని పూర్వీకులు చూపించిన దారిలో మన సంస్కతిని భావిత రాలకు అందించేలా కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రావణ సుర వధ కార్యక్రమాన్ని అంబరాన్ని అంటే సంబరాలు చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వివిఐపి మొదలుకొని సామా న్య ప్రజానీకం కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నెలరోజుల నుండి దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రణా ళిక బద్దంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. దాతలు అందించిన సహాయ సహకారంతో ప్రతి ఏడు సరికొత్తగా ఉత్సవాలను నిర్వహిస్తూ దేశంలో రెండో స్థానంలో రంగలీల మైదాన రావణాసుర వధకు వచ్చిన గుర్తింపును నిలబెట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుల సహకారం తీసుకున్నామని నాలుగు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేసామని వాహనాల్లో వచ్చేవారు రావణాసుర వద్ద తిలకించడానికి వచ్చేవారు పక్కవారికి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను తిలకించాలని కోరా రు. దసరా ఉత్సవ కమిటీ సభ్యులు ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్, ప్రోగ్రాం కన్వీనర్ నరేందర్, కార్యని ర్వాహణ కార్య దర్శి లు వోగిలిశెట్టి అనిల్ , సమ్మయ్య, గోనే రాంప్రసాద్, దమరకొండ వెంకటేశ్వర్లు, నాగపూరి రంజిత్ , పొగాకు సందీప్, సుంకరి సంజు బొల్లం రాజు, కత్తెరశాల వేణు, పూ దారి అజరు, నాగపురి అశోక్, నాగపురి మహేష్, వడ్నాల శీను, గట్టు గోవర్ధన్, నాగపురి కాళీ, నాగపురి సం తోష్, పొగాకు చిరంజీవి, గట్టు రమేష్, బత్తిని రవి చందర్ ,బత్తిన అఖిల్ సతీష్ పూజారి విజరు, పార్వతి కష్ణంరాజు, మీరు పెళ్లి వినరు శేఖర్ ,శ్రీరాములు చరణ్, ఎలగందుల కృష్ణ మూర్తి , బత్తిని, వంశీలు పాల్గొన్నారు.