Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-డోర్నకల్
మండల పరిధిలోని గొల్ల చర్ల గ్రామంలో అంబేద్కర్ సెంటర్లో కేవీపీఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ మండల కార్యదర్శి పెంటిక వెంకట్రాములు పాల్గొని జెండా విష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల వివక్ష నిర్మూలనే ప్రధాన కర్తవ్యంగా మహాత్మ జ్యోతిరావు పూలే, భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ పోరాటల స్ఫూర్తితో వారి ఆశ యాలు సాధించడమే కేవీపీఎస్ ధ్యేయమన్నారు. 25 ఏండ్లుగా దళితులు ఎదుర్కొంటున్న కుల వివక్ష దాడులపై పోరాడుతోందన్నారు. రాజ్యాం గ హక్కుల సాధన కోసం పని చేస్తున్న దన్నారు. నిరంతర పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించిందని గుర్తు చేశారు. జస్టిస్ సున్నయ్య కమిషన్ వేసి ఎస్సీ ఎస్టీ కమిష న్ సాధించామని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం, దళితుల స్మశాన వాటిక స్థలాలకు 1235జీవో, కుల దురహంకార వ్యతిరేకంగా ప్రతిఘటించి, దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందన్నారు. భవిష్యత్ పోరాటాల్లో ప్రజలు భాగస్వామ్యమై సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు గూడూరు వెంకన్న, వరదయ్య, పగిడిపల్లి నాగేశ్వరరావు, గూడూరు బిక్షం,వీరన్న తదితరులు పాల్గొన్నారు.