Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్డీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య
నవతెలంగాణ-బయ్యారం
ఫారెస్టు అధికారులు మండలంలోని పంది పంపుల గ్రామంలోని సనప రాంబాబుకు చెందిన 5 ఎకరాలలో చేతికొచ్చిన మొక్కజొన్న పైరును నేల మట్టం చేశారని, కేసీఆర్ ప్రభుత్వం ఒక వైపు పోడు భూములకు పట్టాలిస్తామని చెపు తుండగా గంగారం రేంజర్ చలపతి రావు, బీట్ ఆఫీసర్ ఆదినారాయణ ఆధ్వర్యంలో పంటల విధ్వంసానికి పాల్పడటంలో ఆంతర్యమేమిటని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య ప్రశ్నించారు. ఫారెస్టు వాళ్ళు ద్వంసం చేసిన రాంబాబు పంట చేనును సోమవారం పార్టీ కార్యకర్తలు, స్థానికులతో కలిసి పరిశీలించి ఆయన ప్రసంగించారు. జిల్లా మంత్రి, కలెక్టర్, తహశీల్దార్, ఎంపీడీఓలు జిల్లా మండలస్థాయి సమావేశాలు జరిపి 3 నెలల్లో పోడు భూముల పట్టాల ప్రక్రియను పూర్తి చేస్తా మని చెపుతున్నారని, అప్లికేషన్లు పెట్టిన భూము లను సర్వే చేస్తున్నారన్నారు. ఇలాంటి స్ధితిలో ఎవరి ఆదేశాల మేరకు ఫారెస్టు వారు పంటల విద్వంసానికి పాల్పడుతున్నారని ప్రశ్నించారు. మేడారంలో చేతికొచ్చిన పత్తి పంటను ట్రాక్టర్లతో దున్నించారని, పంది పంపులలో చేతికొచ్చిన మొక్క జొన్న పంటను నాశనం చేశారని అన్నారు. రాంబాబు పట్టా హక్కు కోసం అప్లికేష న్ కూడా పెట్టుకున్నాడని, అయినా ఫారెస్టు వాళ్ళు పంటను ద్వంసం చేశారన్నారు. గత నెల రోజుల క్రితం ఈ గ్రామంలోనే ఇద్దరు ఆదివాసీ మహిళా రైతుల పంటచేల పై ఫారెస్ట్ వాళ్ళు కలుపు మందు కొట్టి పంటను ధ్వంసం చేశార న్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించా లన్నారు. దీనిపై జిలా ్లమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ లు సమాధానం చెప్పాలన్నారు. విద్వంసానికి పాల్పడ్డ ఫారెస్టు అధికారులపై చర్యలు తీసుకోవాలని, పోడు పట్టాల పక్రియ పూర్తయ్యే వరకు పంటల విధ్వంసానికి, పంటచేలలో కందకాలు తవ్వకానికి పాల్పడ కుండా ఫారెస్టు అధికారులకు ఆదేశలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మోకాళ్ళ మురళీ క్రిష్ణ, సీతారామయ్య, పూకె పద్మ,, ఎస్.కె మదార్, జడసత్యనారాయణ, రామగిరి బిక్షం ,మాధం శెట్టి నాగేశ్వర రావు, మేకపోతుల నాగేశ్వరరావు, పూనెం లింగన్న, బానోత్ నర్సింహ, పాయం సమ్మయ్య, రాంబాబు, అరెం కోటమ్మ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.