Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని గౌరారం గ్రామపం చాయతీకి చెందిన దళిత బంధు లబ్ధిదారుడు గుర్రాల హరిబాబుకు మంజూరైన సూపర్ మార్కెట్‌ను ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సూచనల మేరకు గూడూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన హరిబాబు సూపర్ మార్కెట్ ను సోమవారం మండల వైస్ ఎంపీపీ, టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తాతా గణేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు గుర్రాల హరిబాబు మాట్లాడుతూ... ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, గౌరారం సర్పంచ్ తాటి వెంకన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు తేజావత్ మల్సూర్, కోఆప్షన్ సభ్యులు దేవునబోయిన శ్రీను, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.