Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శాయంపేట
శాయంపేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆసరా పింఛన్ లబ్ధిదారులు పింఛన్ల కోసం గంటల తరబడి నిరీక్షిస్తుండడం సోమవారం నవ తెలంగాణ క్లిక్ మనిపించింది. పోస్ట్ మాన్ బట్వాడ పంపిణీ పూర్తయ్యాక పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. సోమవారం సద్దుల బతుకమ్మ పర్వదినం కావడంతో డబ్బులు వస్తే పండగకు వినియోగించుకోవచ్చని ఉదయం 9 గంటల నుండి మధ్యా హ్నం 3 గంటల వరకు పింఛన్ లబ్ధిదారులు ఎదురు చూశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పోస్ట్మాన్ ద్వారా కాకుండా, ప్రత్యేక ఉద్యోగితో ఆసరా పింఛన్లు అంద జేసి సమస్య పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.