Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి
నవతెలంగాణ-జనగామ
సమాజ హితమైన సాహిత్యం కలకాలం ప్రజల్లో హృదయాల్లో నిలిచి పోయిందని, అదే కోవకు చెందినదే పొతన సాహిత్యమని కల్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి అన్నారు. సోమవారం జనగామ కవులు కళాకారుల ఐక్య వేదిక అధ్వర్యంలో వేదిక కన్వీనర్ జి.కష్ణ అధ్యక్షతన జరిగిన పోతన భాగ వతంపై కవి సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పోతన నడయాడిన బమ్మెర ప్రపంచానికి సాహిత్య పరిమళాలు వెదజ ల్లుతున్న కేంద్రంగా గుర్తింపు పొందిందని అన్నారు. కవులు పోతన సాహి త్యంపై సృజించిన కవితలు వారి గొప్పతనానికి నిదర్శమని అన్నారు. ఈ సందర్భంగా కవితగానం చేసి కవులకు ఆయన ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆరుట్ల దశమంత రెడ్డి పాల్గొని మాట్లాడుతూ సమాజంలో మార్పు,చైతన్యం కవుల కళాకారుల వల్లనే సాధ్య మౌతుందని అన్నారు. 45 మంది కవులు కవితా గానం చేశారు. అనంతరం మాచర్ల బిక్షపతిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్వో కలవల శ్రీనివాసరావు, ప్రొఫెసర్ తాటికొండ వెంకటరాజయ్య, కవులు పెట్లోజు సోమేశ్వరాచారి, పానుగంటి రామమూర్తి, అయిలా సోమనర్సిం హచారి, మాన్యపు భుజేందర్, లగిశెట్టి ప్రభాకర్, కొలిపాక బాలయ్య,మసురం రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.