Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
శాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఇటీవల జరిగిన ఘటనలపై డీసీఓ ఆదేశాల మేరకు సోమవారం నోడల్ అధికారి విజయభాస్కర్ రెడ్డి సందర్శించి విచారణ చేపట్టారు. ముందుగా బాధితుడు నాగేల్లి లింగమూర్తి, సిబ్బంది పెరుగు శంకర్, అటెండర్ పోశాలతో విచారణ చేపట్టారు. జరిగిన ఘటనను బాధితుడు లింగమూర్తి వివరించారు. చైర్మన్ శరత్ కులం పేరుతో దూషించాడా అని సిబ్బందిని, డైరెక్టర్లను అడిగి తెలుసుకుని లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. అనంతరం సొసైటీ డైరెక్టర్లతో మాట్లాడి వివరాలు సేకరించి ఫిర్యాదు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సొసైటీలో జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఘటనపై నివేదిక తయారు చేసి డీసీఓకు అందజేస్తానని తెలిపారు. తదుపరి వారి ఆదేశాల మేరకు బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. సొసైటీలో ఏ సమస్య తలెత్తినా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నోడల్ అధికారి తెలిపారు.