Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చల్లో ధర్మారెడ్డి
నవతెలంగాణ-పరకాల
పరకాల ప్రాంత చిరకాల కోరిక 100 పడకల ఆసుపత్రి నిర్మాణంకు నాణ్యమైన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను , కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశించారు. సోమవారం పట్టణం లోని ఎంపీడీవో కార్యాలయ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని అధికారులతో పరిశీలించి తగిన సలహాలను సూచనలను చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పనులను పూర్తి చేయాలని అన్నారు. ఆసుపత్రి నిర్మాణాన్ని అణువణువునా క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు ,కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ,వైస్ చైర్మెన్ జైపాల్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.