Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎంఎస్ డిమాండ్
నవతెలంగాణ-బయ్యారం
రైతాంగ ఉద్యమానికి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ఏఐకేఎం ఎస్ డిమాండ్ చేసింది. సోమవారం ఎస్కెఎం ఎస్ పిలుపులో భాగంగా సోమవారం మండ లంలోని వెంకట్రాంపురంలో నేటికి సంవత్సరం పూర్తయినా హామీలు నెరవేర్చనందుకు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... సంవత్సరం పైగా రైతాంగ ఉద్యమ పోరాట ఫలితంగా ఏడు వందల మందికి పైగా రైతుల ఆత్మబలిదానాల అనం తరం కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతాంగ సమస్యల్ని తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చి రైతాంగ ఉద్యమాన్ని విరమింపజేసిందన్నారు. సంవత్సరం దాటుతు న్నప్పటికీ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా, మరోమారు రైతాంగాన్ని మోసం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతాంగ ఉద్యమానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలుకు పూనుకోవాలని అన్నారు. లఖింపూర్ ఖేరి ఘటనకు బాధ్యులైన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అజరు మిశ్రాను బర్తరఫ్ చేయాలని, చనిపో యిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాపిత రైతు ఉద్యమానికి సిద్ధం కావాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. తక్షణమే కేంద్ర విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోవాలని రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టు బాటు ధర నిర్ణయించి చట్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ చంద్రుల మురళి, బొల్లం సోమక్క, తూముల నరసింహా రావు, శెట్టి జగన్నాథం, కొండా సాయమ్మ, ఆజ్మీరా వెంకట్రామ్, అజ్మీరా తేజ్యా, కుక్క సత్యం, కొలిపాక కొమరయ్య, సింగ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.