Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్బీఎంఐ అధ్యక్షులు రమేష్‌నాయక్, సెక్రటరీ కిషన్‌నాయక్
నవతెలంగాణ-నరసింహులపేట
జీవో 33ని 9వ షెడ్యూల్లో చేర్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరాటం చేయాల్సిందేనని జాతీయ బంజారా మిషన్ మహబూ బాబాద్ జిల్లా అధ్యక్షులు రమేష్ నాయక్, జనరల్ సెక్రెటరీ కిషన్ నాయక్ పిలుపు నిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు గుగులోతు గోపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం 10 శాతం రిజర్వేషన్ జీవో 33 ను విడుదల చేసిన సందర్భంగా గిరిజన బిడ్డల తరఫున ధన్యవాదాలు తెలిపారు. రిజర్వేషన్ సాధనకై వివిధ గిరిజన విద్యార్థి సంఘాలు చేసిన పోరాటాలు, పాదయాత్రలు ఎలనేనివని కొనియాడారు. గిరిజన జాతి ఐక్యంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ పెంపుపై అనుమతులు ఇవ్వకుండా కాలయాపన చేసిందని అన్నారు. ఎనిమిదేండ్లుగా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో గిరిజనులకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోతో చేతులు దులుపుకోకుండా హామీ ఇచ్చిన రిజర్వేషన్ పై న్యాయపరమైన చిక్కులు వచ్చిన వెనుకాడ కుండా గిరిజన బిడ్డల తరఫున పోరాడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన బిడ్డలు రవి నాయక్, నరేష్ నాయక్, హుస్సేన్ నాయక్, పార్వతి, లక్ష్మీ, దేవి తదితరులు పాల్గొన్నారు.