Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరిపెడకు ఓడీఎఫ్ ప్రకటించిన కేంద్రం
- రానున్న పదేళ్లలో మరిపెడ
- రూపు రేఖలు మారుస్తాం
- డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
నవతెలంగాణ-మరిపెడ
కొత్త రాష్టంలో కొత్త మునిసిపాలిటీగా రూపాంతరం చెందిన మరిపెడ నేడు అన్ని విధాల అబివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని, నాటి గ్రామపంచాయతీకి నేటి పట్టణానికి ప్రస్పుటమైన మార్పు కనిపిస్తున్నదని, రానున్న పదేళ్లలో మరిపెడను మరింత అభివృద్ధి చేసి వచ్చే భావితరాలకు బహుముఖ నిర్మిత పట్టణాన్ని అందిస్తామని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. సోమవారం మరిపెడ మునిసిపాలిటీ అభివద్దిలో భాగంగా సుమారు రూ.4కోట్లతో నిర్మించిన కూరగాయల మోడల్ మార్కెట్, స్మశాన వాటిక, బతుకమ్మ ఘాట్లు, మరిపెడ ఎస్సీ కాలనీలో పార్క్ ఓపెన్ జిమ్, నూతన హైమాస్ట్ లైట్ల, జర్నలిస్టుల డబుల్ ఇళ్ల ప్రారంభోత్సవాల కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మానుకోట ఎంపీ మాలోత్ కవిత, డోర్నకల్ యువనేత ధర్మసోత్ రవిచంద్రతోపాటు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరిపెడకు రూ.20కోట్లు మంజూరు చేశారన్నారు. కానీ కరోనా కారణం ఇద్దరు కాంట్రాక్టర్ల మరణంతో అభివృద్ది పనులు ఆలస్యం అయ్యాయన్నారు. నేడు మరిపెడలో పెరిగిన జనాభాక నుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ముందం జలో ఉంటుందన్నారు. కూరగాయల యాలు విక్రయ నిర్వా కులకు మార్కెట్ వసతి కల్పించటం ఆనందంగా ఉంద న్నారు. నగరాల్లోని మోడల్ మార్కెట్లకు తీసీ పోకుండా రూ.2కోట్లతో మార్కెట్ నిర్మించుకున్నా మన్నారు. తద్వారా అంగడీ రోడ్లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. రానున్న రోజుల్లో నాన్‌వెజ్, చేపలు అమ్ముకునే వారికి కూడా తగిన ఏర్పాట్లు చేయటం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట ఏర్పాటుకు ముందు ఎంతో మంది పట్టణాలు, పల్లెల్లో శవాన్ని తీసుకెల్లేందుకు, దహన సంస్కరాలు ఎక్కడ చేయాలో తెలియని ఆర్థిక స్తోమత లేక ఇబ్బందు పడ్డ రోజులున్నాయన్నారు. వీట న్నింటిని గమనించిన ప్రభుత్వం అన్ని పల్లె పట్టణాల్లో ప్రజల సౌకర్యార్థం స్మశాన వాటికలు నిర్మిస్తున్నారని అన్నారు. మరిపెడలో రూ.17లక్షలతో అంతి యయాత్రకు అవసరమైన వైకుంఠ రథాన్ని కూడా అందు బాటులోకి తెచ్చా మన్నారు. రూ.40లక్షలతో మరిపెడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలం గాణ ఏర్పాటులో జర్న లిస్టుల కృషి మరువలేనిద న్నారు. నేడు మరిపెడ మండల పరిధి సీనియర్, అక్రిడేటెడ్ జర్న లిస్టులకు డబుల్ ఇండ్లు అందించటం ఆనందంగా ఉంద న్నారు. రానున్న రోజుల్లో అర్హులందరికి ఇళ్లు అందేలా చూస్తానన్నారు. పేదల ఇళ్లకు 58, 59 జివోల ద్వారా శాశ్వత పట్టాలు కల్పించాల్సిందిగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలి చ్చినట్టు తెలిపారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు, మునిసిపల్ చైర్మెన్ గుగులోత్ సింధూర రవి, ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జడ్పీటీసీ తేజావత్ శారదా రవీందర్, వైస్ చైర్మెన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ గాదె అశోక్ రెడ్డి, మరిపెడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షడు తాళ్లపెల్లి శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు తాళ్లపల్లి రఘు, మరిపెడ మండల పార్టీ అధ్యక్షుడు రామసహాయం సత్యనారాయణ రెడ్డి, తెరాసా జిల్లా నాయకులు రామడుగు అచ్యుత రావు, కుడితి మహేందర్ రెడ్డి, గుగులోత్ వెంకన్న, షేక్ ఆయూబ్ పాషా, మచ్చ వెంకట నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు ఉప్పల నాగేశ్వర రావు, మండల ఉపాధ్యక్షడు నారెడ్డి సుదర్శన్‌రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు అంబడి వెంకట్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు కాలు నాయక్, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ రాంప్రసద్, ఎంపీడీఓ కెలోట్ దంసింగ్, మున్సిపల్ ఈ ఈ రంజిత్ రెడ్డి, డీఈలు, ఏఈలు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.