Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి రాజయ్య
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మని, ఈలాంటి సంస్కృతి మన తెలంగాణాలో ఉందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వర్ణించారు. సోమవారం స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండలాల్లో సోమవారం బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. మండలంలోని నమిలి గొండ సర్పంచ్ ఉప్పలస్వామి, మండల మహిళా అధ్యక్షురాలు స్వాతిశ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తాటికొండ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొని, మహిళలందరికీ సద్దుల బతుకమ్మ, దసరా ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఊరువాడ ఒక్కచోట చేరి తీరొక్క రంగురంగుల పూలను పేర్చి ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకతి పండుగ బతుకమ్మని, తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా అధికారికంగా ఘనంగా నిర్వహించడమే కాకుండా, తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరలను అంధించడం జరిగిందని తెలిపారు. చిల్పూర్ మండలంలో సర్పంచ్ రాజ్ కుమార్, లింగంపల్లి సర్పంచ్ ఎదునూరి రవీందర్, మల్కాపూర్ సర్పంచ్ కొంగరి రవి, నియోజక వర్గ కో ఆర్డినేటర్ రంజిత్ రెడ్డి, కొండాపూర్ లో సర్పంచ్ లోడెం రజితరవీందర్, వెంకటాద్రి పేట సర్పంచ్ రఘుపతి, ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.