Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్షతో ఉద్యమిస్తే, తెలంగాణ స్వరాష్ట్రం వచ్చింది కాబట్టే ఇంతటి అభివృద్ధి జరుగుతుందని డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం చిల్పూర్ మండలం దేశారు తండాలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన కడియం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం తండాలను పంచాయ తీలుగా చేసి, పరిపాలన సౌలభ్యం గిరిజనులకు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ఈ ప్రాంత గిరిజన, లంబాడ తెగల బలోపేతానికి ఎనలేని కషి చేశారని, గిరిజన ఆదివాసీ బంజారా ఆత్మ గౌరవానికి ప్రతీకగా బంజారాభవన్ ఏర్పాటు చేయడమే గాకుండా, సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించడమే గాక, గిరిజన పక్షపాతిగా ''మా తండాలు మా రాజ్యం'' అనే నినాదంతో గిరిజనులకు ఎంతో మేలు చేశారని కొనియాడారు. ఈకార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ రూరల్ అధ్యక్షుడు బెలిదే వెంకన్న, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, రాజవరం సర్పంచ్ మారేపల్లి తిరుమల క్రిష్ణామోహన్రెడ్డి, ఎంపిటిసిలు మారేపల్లి లలితా దేవి, శ్యాం కుమార్ రెడ్డి, రజాక్ యాదవ్, సాదం నర్సింహులు, నాయకులు మాజీ జెడ్పీటిసి భూక్య స్వామి నాయక్, రాజేష్ నాయక్, బూర్ల శంకర్, కోతి రాములు, మారపాక ఇసాక్, దేవేందర్ నాయక్, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, కడియం యువసేన నాయకులు ఎల్మకంటి నాగరాజు, భూక్య సంజీవ, శ్రీనివాస్, కాలు నాయక్, రాజన్న, హరిలాల్, తదితరులు పాల్గొన్నారు.