Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండలంలోని ముల్కనూరు పంచాయతీ పరిధిలోని గుంపెళ్లగూడెంలో నిరుపయోగంగా నిర్మాణం లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను తక్షణమే పూర్తి చేసి నిరుపేదలకు ఇవ్వాలని న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి జి. సక్రు డిమాండ్ చేశారు. గుంపెళ్లగూడెంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదవారికి ఇవ్వాలని న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో స్దానిక తహసిల్దార్, ఎంపిడివో కార్యాలయాల ముందు ఇందిరానగర్ తండా, సత్యనారాయణ పురం గ్రామస్థులతో కలిసి సోమవారం అందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో అమలు చేసే విధంగా చేయాలన్నారు. ఇండ్లు స్థలాలు ఉన్న అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ చేశారు. అనంతరం తహశీల్దారు రాము, ఎంపిడివో రవీందర్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టి మంక్తు, సుమన్, మాన్య, శంకర్, అంకి, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.