Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
ప్రపంచంలోనే పూలను పూజించే చరిత్ర తెలంగాణలో ఉందని, సర్పంచ్ అజ్మీర బన్సీలాల్, ఎస్సై బానోత్ వెంకన్న అన్నారు. మండల కేంద్రం లోని కొలిమి కొట్టం బజారు (దాశరధి నగర్) లో ఐద్వా అధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వారు పాల్గొని మాట్లాడుతూ ఎన్నో కుటుంబ సమస్యల నడుమ సతమతం అవుతున్న మహిళలు ఆనందోత్సవాలతో జరుపుకొంటూ సాంప్రదాయాలను కొనసాగించడం అభినందనియం అన్నారు. అనంతరం 35 మంది మహిళలకు బహుమతుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత, ప్రజా సంఘాల నాయకులు కందునూరి శ్రీనివాస్, యం. గిరిప్రసాద్,బి. హరి,ఐద్వా నాయకురాలు ఎం నాగమణి, సత్యవతి, రమా, నాగమణి, సుజాత, పద్మ,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.