Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ గణేష్‌ను అభినందించిన ఏసీపీ శివరామయ్య
నవతెలంగాణ-ఆత్మకూర్
సీసీ కెమరాల ఏర్పాటుతో గ్రామంలో అసాం ఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని, ఒక్క సీసీి కెమెరా వందమంది పోలీసులతో సమానమని , శాంతిభద్రతల కాపాడడంతో సీసీ కెమెరాల పాత్ర కీలకమైందని ఏసీపీ శివరామయ్య అన్నారు. సోమవారం మండలంలోని నాగయ్యపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను సిఐ తౌటం గణేష్‌తో కలిసి ఎసీపీ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. దసరా పండగ రోజు ప్రజలు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుం టామని, శాంతియుతంగా పండగను జరుపుకో వాలని ఏసీపీ అన్నారు.సీసీ కెమెరాలపై అవగాహన కల్పించిన సీఐ తౌటం గణేష్‌ను, సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఉద్యోగులను, వ్యాపా రస్తులను, ప్రజలను అభినందించారు. ఈ కార్యక్ర మంలో ఎస్సై ప్రసాద్, సర్పంచ్ మాదాసి రజిత-రమేష్, ఉపసర్పంచ్ పోగుల సుగుణాకర్, వార్డు సభ్యులు మాదాసి భాగ్య, రాజశేఖర్,కష్ణ,అనిత,నేరెళ్ల కమలాకర్, నేరెళ్ల రాజు, రమణారెడ్డి, ముల్క రాజు, గుండాల సంపత్, పోగుల యాదగిరి, మోహన్, సీఏ సరిత, కారోబార్ రాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.