Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
నవతెలంగాణ-సుబేదారి
ప్రపంచంలో పూలను ఆరాధించే సంస్కృతీ ఒక్క తెలంగాణకే ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం దర్గా రోడ్డు లోని బంధం చెరువు వద్ద దాదాపు రూ.2లక్షల30 వేల తో నిర్మించిన బతుకమ్మ విగ్రహావిష్కరణ కార్యక్ర మానికి ఎమ్మెల్యే అతిథి బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్క రించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఆడపడుచులు అందరూ ఎలాంటి తారతమ్యాలు లేకుండా కలిసి మెలసి ఆడుకునే పండుగ బతుకమ్మ అన్నారు. ఒకప్పుడు తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగ.. నేడు విశ్వవ్యాప్తం కావడం గర్వంగా ఉందని వెల్లడించారు. తెలంగాణ పండు గల విశిష్టతను భావితరాలకు అందిస్తూ మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని పేర్కొన్నారు. ప్రజలందరూ సంతోషకర వాతావ రణంలో బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకో వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రావిణ్య, కుడా చైర్మెన్ సంగం రెడ్డి సుందర్ రాజ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, స్ధానిక కార్పొరేటర్ ఏనుగు మానస రాంప్రసాద్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.