Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని సద్దుల బతుకమ్మ నిమజ్జన పర్వదినాన్ని పురస్కరించుకొని 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన నవీన్ ఆధ్వ ర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని పిన్నవారి వీధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక పర్వదినాలైనా దేవి శరన్నవరాత్రులలో అన్నదాన వితరణ కార్యక్రమం నవరాత్రులు ప్రారంభమైన రోజు నుండి నిర్వహి స్తున్నట్లు చెప్పారు. అన్న ప్రసాద వితరణతో మనసుకు ప్రశాంతత ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో 28వ డివిజన్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
కాశిబుగ్గ : గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో న్యూ యువ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా సోమవారం తెలంగాణ ఉద్యమకారుడు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు భూక్య ఝాన్సీ మోతీలాల్ దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అన్నారు. కార్యక్రమంలో యూత్ ప్రతినిధులు రాజు, గణిపాక కిరణ్, గనిపాక కిషోర్, బైరి తరుణ్, గోలి సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు.
మంగపేట : మండలంలోని తిమ్మంపేట అంబేద్కర్ సెంటర్లో శరన్నవరాత్రుల కమిటీ, అంబేద్కర్ యూత్ కమిటీల ఆధ్వర్యంలో సోమవారం మహాఅన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలోని సుమారు 2 వేల మందికి అన్నదానం చేశారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ శరన్నవ రాత్రులను పురష్కరించుకొని తొమ్మిది రోజుల పాటు అమ్మవారి అనుగ్రహంతో దాతలు, గ్రామస్తులు ముందుకు వచ్చి మహాఅన్నదానం కార్యమాన్ని నిర్వహి స్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సందర్శకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.