Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి ఉపేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాలు తేడా లేకుండా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి , వాటిని అమలు చేసి రాష్ట్రాన్ని స్థానిక ఎమ్మెల్యే అబివృద్ధి పథంలో ముం దుండి నడిపిస్తున్నారన్నారు. మండల కేంద్రంలోని అశోక్ నగర్లో 6 నెలల క్రితం షుగర్ వ్యాధితో బాధపడుతున్న రామ్మోహన్రెడ్డి కుడి కాలుని తొలగించారన్నారు. హాస్పిటల్లో ఖర్చుల, మందుల ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహయనిధి నుండి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రూ.60 వేలు మంజూరు చేయిం చి, చెక్కు గ్రామ పార్టీ ద్వారా బాధిత కుటుంబానికి అందించారని తెలిపారు. అందజేసిన వారిలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు యాదగిరి రావు, ప్రధాన కార్యదర్శి రాసల రమేష్, సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కర్ర రమేష్, నరేందర్, కొమురయ్య, కోటేశ్వర, గోవింద్ రవి, యూత్ అధ్యక్షుడు నోముల నరేష్, బొంతల శ్రీను, నిమ్మల రమేష్, తదితరులు పాల్గొన్నారు.