Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజు కూలి రూ.200 నుంచి రూ.260 కి పెంపు
నవతెలంగాణ-వెంకటాపురం
కూలీ పోరాటం ఫలించింది. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా రోజు వారి కూలీ రూ.311 కి పెంచాలని డిమాండ్ చేస్తూ కూలీలు 11 రోజులుగా రోజూ వారి కూలీ పనులకు వెళ్ల కుండా వివిధ రకాలుగా ఆందోళ కార్యక్రమాలు చేపట్టారు. కూలీ రేటు పెంచేదాకా పనులకు వెళ్లేది లేదంటూ ఆందోళన కొనసాగించారు. తహశీల్ధార్ కార్యాలయంలో రెండు సార్లు జిల్లా లేబర్ అధికారి వినోద, తహసిల్దార్ నాగరాజు సమక్షంలో కూలీలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రైతులతో చర్చలు జరిపినా వాయిదా వేస్తూ వచ్చాయి. సోమవారం స్థానిక పోలీస్టేషన్లో ఎస్సై తిరుపతి రైతులు, కూలీలు, నాయకులతో చర్చలు జరిగాయి. రోజు కూలీ రూ.200 నుంచి రూ.260 కి రోజు కూలీ పెంచేందుకు రైతులు ఒప్పు కున్నట్లు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ,వ్యవసాయబకార్మిక సంఘం జిల్లా నాయకులు గ్యానం వాసు, సీఐటీయూ నాయకులు కట్ల చారి, ఆదినారాయణ కుమ్మరి శ్రీను, కూలీలు సరస్వతి, గ్రామాల కూలీలు పాల్గొన్నారు.