Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మల్హర్రావు
మంథని నియోజకవర్గంలో ఇసుక క్వారీలను వారం రోజుల పాటు నిలిపివేయాలని ప్రజా సంఘాల నాయకులు అక్కల బాపు యాదవ్, పీక కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేం ద్రంలో ఏర్పాటు చేసిన సమా వేశం లో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండు గలైన బతుకమ్మ, దసరా నేపథ్యంలో ప్రజలు తమ సొంత ఊర్లకు అధిక సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. బట్టలు, నిత్యావసర సరుకుల కొనుగోలుకై పెద్ద సంఖ్యలో పట్టణాల కు వస్తున్నారు. ఈ క్రమంలో ఇసుక క్వారీల నుంచే వచ్చే లారీల, ట్రాక్టర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బండి నర్సింగం, మిణుగు నగేష్ పాల్గొన్నారు.