Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకునే సద్దుల బతుకమ్మ, దసరా పండగ రోజుల్లో ఏ ఒక్క పేద కుటుంబం అర్థాకలితో జీవించవద్దనే సదుద్దేశంతో బిల్లా శివాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి సోమవారం మండల కేంద్రంలోని ఏడు నిరు పేద కుటుంబాలకు రూ.11.500 ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నంతలో ఇతరులకు సహాయం చేసే గుణం ప్రతి ఒక్కరూ అలవ ర్చుకోవాలన్నారు. సేవా దక్పథాన్ని చాటి చెప్పడం మానవుని నైతిక బాధ్యత అని తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికలు రూపొం దిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు మండల కోఆర్డినేటర్ సురేందర్ రావు, సర్పంచ్ గారె నరసయ్య, ఎంపిటిసి రాంచందర్, ముద్రబోయిన సుధాకర్, మల్యాల నరసింహమూర్తి, పోగులకొండ వేణు, మహమ్మద్ అక్బర్, ప్రసాద్, చందు సతీష్, శ్రీనివాస్, ఐత సంపత్, తదితరులు పాల్గొన్నారు.