Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాటారం
మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలను అధికార పార్టీకి చెందిన నేతలు చింపేశారని ఆరోపించారు. మంథనిలో బిజెపి పార్టీకి వస్తున్న జనాధారణ చూసి జీవించుకోలేక ప్లెక్సీలు చించివేశారన్నారు. ఫ్లెక్సీలు చించి వేసే విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బిజెపి నాయకులు తెలిపారు. ఈ విషయంపై ఎస్సై సానుకూలంగా స్పందిస్తూ దోషులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బిజెపి నాయకులు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పూసాల రాజేంద్రప్రసాద్, బీజేవైఎం మండల అధ్యక్షుడు ముద్రకొల్ల సుధాకర్, ఉడుముల వెంకట్ రెడ్డి ఉన్నారు.
శివనగర్‌లో ఫ్లెక్సీల వివాదం
ఖిలా వరంగల్ : సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. శివనగర్‌లో సద్దుల బతుకమ్మ పండగ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశా రు. సోమవారం సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు, యూత్ నాయకులు బతుకమ్మ ఆట స్థలం వద్ద మహిళలకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే 35వ డివిజన్ నుంచి ఇండి పెండెంట్గా బరిలో నిలిచి గెలవకపోయిన ప్రజల నుంచి అనూహ్య ఆదరణ చూరగొన్న మేరుగు అశోక్ ఎక్కడ రాజకీ యంగా ఎదుగుతాడోనని గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఫ్లెక్సీలను చింపివేశారు. అందరూ ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలు అలాగే ఉండి, కేవలం మేరుగు అశోక్ ఫ్లెక్సీలు మా త్రమే చించడంతో పలువురు ప్రజలు, స్థానికులు ఆయన రాజకీయ ప్రత్యర్థులే ఈ పని చేసుంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపడం సరికాదని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఈ ఘటనను స్థానికులు ఖండిస్తున్నారు.