Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
మండలంలోని బావుసింగ్‌పల్లిలో వేశాల స్రవంతి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ విగ్రహాన్ని సోమవారం ఎమ్మెల్యే సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పూలను పూజించే పండుగ బతుకమ్మ అని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంకతి లక్ష్మి జగదీశ్వర్, కాంగ్రెస్ వెంకటాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ, ములుగు జిల్లా నాయకులు భగవాన్ రెడ్డి, బండి శ్రీనివాస్, గ్రామ నాయకులు సుకూర్, మామిండ్ల రాజు, గట్టు మహేందర్, ఈర్ల చిరంజీవి, తిరు పతి, కుమార్, రవి, శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రతిక సద్దుల బతుకమ్మ : ఎమ్మెల్యే గండ్ర
టేకుమట్ల : తెలంగాణ ప్రతిక సద్దుల బతుకమ్మ అని స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని రాఘవపూర్‌లో సర్పంచ్ నందికొండ శోభా మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అత్యంత పెద్ద పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పిటిసి పులి తిరుపతి రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్ల రవి, వైస్ ఎంపీపీ ఐలయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర
నవతెలంగాణ-చిట్యాల
మండలంలోని జుకల్లో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అనేక నిధులు మంజూ రు చేసి వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు కషి చేశారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గొర్రె సాగర్, సర్పంచ్ పుట్టపాక మహేందర్, ఎంపీటీసీ జంబుల తిరుపతి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆరెపల్లి మల్లయ్య, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఏరుకొండ గణపతి, వార్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు.
బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన సర్పంచ్
నవతెలంగాణ-ములుగు
ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించే సంస్కతి ఒక్క తెలంగాణకే ఉందని సర్పంచ్ అక్కల రఘోత్తమ్ అన్నారు. మండలంలోని బండారుపల్లి ఊర చెరువు కట్టపై ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్ర హాన్ని సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆడపడుచులు అందరూ ఎలాంటి తారతమ్యాలు లేకుండా కలిసి మెలసి ఆడుకునే పండుగ బతుకమ్మ అన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు అక్కల రవి, రాచమల్ల సురేందర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు, అక్కల సతీష్, తదితరులు పాల్గొన్నారు.