Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.4 కోట్లతో చెరువు కరకట్ట పనులు
జిల్లా నలుమూలల నుంచి భారీగా హాజరు నవతెలంగాణ-కాశిబుగ్గ
దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో దసరా అతి ముఖ్య మైనది. నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున విజయదశమి జరుపుకోవడం ఆనవాయితీ. ఆ రోజు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అన్ని రాష్ట్రాల్లో వారి వారి సాంప్రదాయాల ప్రకారం వేడు కలు నిర్వహిస్తుంటారు. వరంగల్‌లోని రంగలీల మైదానంలో జరిగే ఉత్సవాలకు రాష్ట్రస్థాయిలో పేరు ఉంది. ఆ తర్వాత జరిగే కాశిబుగ్గ దసరా ఉత్సవాలకు వరంగల్ నగరం నుండే కాకుండా పరిసర ప్రాంతాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతారు. ప్రారం భంలో ఉత్సవాలకు నాటి ఎమ్మెల్యే తక్కళ్లపల్లి పురుషోత్తమరావు నుండి నేటి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వరకు స్థానిక ఎమ్మెల్యేనే ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు.
33 ఏళ్ల క్రితం ప్రారంభం
దసరా ఉత్సవాలు 1989లో నగరంలోని ఆజంజాహి మిల్లు గ్రౌండ్లో ప్రారంభమయ్యాయి. నాటి నుండి నేటి వరకు క్రమం తప్పకుండా 33 ఏళ్లుగా వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 32 సంవత్సరాలు ఆజాహి మిల్లు గ్రౌండ్లో జరిగిన వేడుకలు ఈ ఏడాది నుండి చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంతో ఉత్సవాల నిర్వ హణకు స్థలాన్ని సేకరిస్తున్నారు. ఇందులో పట్టా భూములు ఉంటే ప్రభుత్వం తరఫున కొని, మౌలిక వసతులు కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వ శాఖల పూర్తి సహకారం
కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చిన్నవడ్డేపల్లి చెరు వు వద్ద జరుగుతున్న ఉత్సవాలకు మున్సిపల్ కార్పొరేషన్, కుడా, పోలీస్ శాఖ, అగ్నిమాపక, షీ టీమ్స్, విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
శాశ్వత ప్రతిపాదికన పనులు :
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక చొరవతో కాశిబుగ్గ దసరా ఉత్సవాలకు చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద శాశ్వత ప్రతిపాదికన పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రూ.4 కోట్లతో చెరువు పద్మానగర్ వైపు కరకట్ట నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ కరకట్ట భద్రకాళి బండ్‌ను మించి ఉంటుందని, కరకట్ట పనులు చెరువుకు ఇరువైపులా చేపడితే ఇది పర్యాటక ప్రాంతంగా, అందమైన చెరువుగా తీర్చిదిద్దబడి, రాష్ట్రస్థాయిలో చిన్న వడ్డెపల్లి చెరువు తటాకంగా ఏర్పడుతుందని ఉత్సవ నిర్వాకులు తెలిపారు. భవిష్యత్తులో మరో రూ. 20 కోట్లతో దసరా ఉత్సవ నిర్వహణకు అత్యంత ఆధునిక వసతులతో అన్ని రకాల వసతులు ఏర్పాటుకు ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వైభవంగా రావణాసుర వద కార్యక్రమం
గుల్లపల్లి రాజ్ కుమార్ (బాంబుల కుమార్) ఆధ్వర్యంలో రావణాసుర వధ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిమను బాణాసంచా, క్రాకర్స్, నాగపాము, మల్లె పందిరి లాంటి సుమారు 30 వెరైటీలతో రావణవధ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
సముద్రాల పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి, ఉత్సవ కమిటీ
ఉత్సవాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యుత్ సరఫరకు ఎలాంటి అంత రాయం కలగకుండా విద్యుత్తు సిబ్బంది అందుబాటులో ఉన్నా రు. ఆర్ అండ్ బి అధికారులు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ వారు పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు, మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారులు త్రాగునీటి సరఫరా ఏర్పాటు చేస్తు న్నారు. ఉత్సవాలకు వరంగల్ నగరం నుండి కాకుండా పరిసర ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆహ్వానిస్తున్నాం.