Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్బెల్ట్
దసరా అడ్వాన్స్, లాభాల వాటా అందుకున్న సింగరేణి ఉద్యోగులు అవసరమైన వాటికి విలువైన డబ్బులు వినియో గించాలని, కష్టార్జితాన్ని వృథా చేయొద్దని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ బళ్లారి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిఎం కార్యాలయంలో ఆయ న అధికారులతో కలిసి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్. శ్రీధర్ సింగరేణి ఉద్యోగులకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కరప త్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఏరియాలోని అన్ని శాఖల ఉద్యోగులకు, యూని యన్ నాయకులకు, పట్టణ ప్రజలకు సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 1,227 కోట్ల రూపాయల లాభాలను సంస్థ గడించగా దానిలో 30 శాతం అనగా రూ.368 లాభాల వాటాగా సింగరేణి ఉద్యోగులు అందుకున్నా రన్నారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరింత లాభాలు అందుకునేలా ఉద్యోగులంతా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ ఓటు జిఎం విజయ ప్రసాద్, ఏజీఎంలు రామలింగం, జోతి, డీజీఎం రమేష్ బాబు, ఏరియా అధికార ప్రతినిధి అజ్మీర తుకారాం, పర్సనల్ మేనేజర్ శివ కేశవరావు తదితరులు పాల్గొన్నారు.